BSNL-VRS: బీఎస్ఎన్ఎల్ మరోసారి వీఆర్ఎస్ అమలు చేయడానికి సిద్ధం.. ! 6 d ago
భారత ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ మరోసారి 'వాలంటరీ రిటైర్‌మెంట్ స్కీమ్స్' వీఆర్ఎస్ అమలు చేసేందుకు సిద్ధమైంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికాంను డాట్ వద్ద ఆర్ధిక అనుమతిని కోరేందుకు బీఎస్ఎన్ఎల్ యోచిస్తున్నట్లు సమాచారం. సంస్థలో పని చేస్తూ 50 ఏళ్లు దాటిన ఉద్యోగులంతా వీఆర్ఎస్ పథకాన్ని వినియోగించుకోవచ్చని యాజమాన్యం తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న లక్షా 50 వేల మంది ఉద్యోగుల్లో లక్ష మందికి వీఆర్ఎస్కు అర్హత ఉన్నట్లు వెల్లడించింది.